Keerthinthu nee namamun na prabhuva కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా


Song no:




    కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2

    మనసారా ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ } 2

    కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2





  1. ప్రతి ఉదయం నీ స్తుతిగానం - దినమంతయు నీ ధ్యానం } 2

    ప్రతి కార్యం నీ మహిమార్థం - సంధ్య వేళలో నీ స్తోత్రగీతం } 2




  2. నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్థుతులన్ చెల్లిస్తూ } 2

    ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ - నిన్నే నేను ఆరాధిస్తూ } 2




  3. అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం } 2

    ఉన్నతమైనదీ నీ నామం - నాకై నిలచిన మోక్ష మార్గం } 2



Previous Post Next Post