Chachina chethulu neeve చాచిన చేతులు నీవే



Song no:




    చాచిన చేతులు నీవే

    అరచేతిలో చెక్కినావే

    కమ్మని అమ్మవు నీవే

    కాచిన తండ్రివి నీవే

    నీలా ఎవరు ప్రేమిస్తారు

    నాకై ప్రాణం అర్పిస్తారు

    కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు

    కళ్ళార్పకుండా కాపాడతారు || చాచిన ||



  1. కొండలు గుట్టలు చీకటి దారులు

    కనిపించదే కళ్ళు చిట్లించినా

    కారాలు మిరియాలు నూరేటి ప్రజలు

    అన్నారు పడతావొక్క అడుగేసినా

    రక్షించే వారే లేరని

    నీ పనైపోయిందని (2)

    అందరు ఒక్కటై అరచేసినా

    అపవాదులెన్నో నాపై మోపేసినా (2)

    నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి

    శత్రువును కూల్చేసి నిలబెట్టినావు || చాచిన ||




  2. పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు

    అవమానపడతాడని నవ్వేసినా

    చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ

    అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా

    నీవెంత నీ బ్రతుకెంతని

    నిలువలేవు నీవని (2)

    అందరు ఒక్కటై తేల్చేసినా

    కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2)

    నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి

    నా గిన్నె నింపేసి నడిపించినావు || చాచిన ||








    Chachina chethulu neevey

    Arachethilo chekkinavey

    Kammani ammavu neevey

    Kaachina thandrivi neevey

    Neela evaru premistharu

    Naakai pranam arpistharu

    Kanniru thudichi karunistharu

    Kallarpakunda kaapadtharu
    ""chachina""



  1. Kondalu guttalu

    cheekati dharulu

    Kanipinchadhey kallu chitlinchinaa

    Kaaralu miriyalu

    nurchedi prajalu

    Annaru padathaa

    okka adugesina

    Rakshinchey vaarey lerani

    Nee panaipoindhani ""2""

    Andharu okkatai arachesina

    Apavadhulenno naapai mopesina. ""2""

    Nee cheyyi chachesi

    cheekatini cheelchesi

    Sathruvunu koolchesi

    nilabettinaavu
    ""chachinaa""



  2. Pedhodu pirikodu

    prabhusevakochadu

    Avamaana padthadani

    navvesinaa

    Chinnodu neevantu

    arhatha ledhantu

    Ayyinollu kaanollu cheppesina

    Neeventhani nee brathukenthani

    Niluvaa levu neevani ""2""

    Andharu okkatai thelchesina

    Kulcheyalani nannu krushichesinaa. ""2""

    Nee aathmatho nimpesi

    nirasanni koolchesi

    Naa ginney nimpesi

    nadipinchinaavu
    ""chachina""

Previous Post Next Post