Bangaru bomma neevamma vadhuvu sangama బంగారు బొమ్మ నీవమ్మా వధువు సంగమా


Song no:



    బంగారు బొమ్మ నీవమ్మా వధువు సంగమా రావమ్మా ||2||

    శృంగార ప్రభువు ఏసమ్మా వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మా ||2||



  1. ప్రత్చ్సాతపమే పెళ్లి చూపులమ్మా

    పాప క్షమాపనే నిర్చితార్ధమమ్మా

    విరిగిన మనస్సు వరుని కట్నమమ్మా

    నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా

    గొరియ పిల్ల రక్తములో తడిసిన

    పవిత్ర కన్యవై నిలిచేవమ్మా } 2 || బంగారు బొమ్మ ||




  2. కొరడా దెబ్బలే పెళ్లి నలుగమ్మా

    అసూయా ద్వేశాలే సుగంధ ద్రవ్యమమ్మా

    నెత్తుటి దారాలే పెళ్లి చీరమ్మా

    ముళ్ళ కిరితమే పెళ్లి ముసుగమ్మా

    ప్రకాశమయమై నిర్మలమైన

    పరిశుద్ధుల క్రియలై నడిచేవమ్మా } 2 || బంగారు బొమ్మ ||




  3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా

    దేవుని దూతలే పెళ్లి సాక్షులమ్మా

    సిలువ దండమే పెళ్లి సూత్రమమ్మా

    దూషణ హేలనే పెళ్లి అక్షింతలమ్మా

    సువర్ణమయమై స్వచ్చమైన

    స్పటికమువోలే మెరిసేవమ్మా } 2 || బంగారు బొమ్మ ||




Previous Post Next Post