Sathvikuda dhinulanu karuninche na yesayya సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య





Song no: 168



    సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య } 2

    సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు } 2

    సమృద్ది అయిన కృపతో నింపుము

    నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము } 2 || సాత్వీకుడా ||



  1. ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై

    నిలువనీడకరువై శిలువపై ఒంటరయ్యావు } 2

    అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో

    సహనము కలిగించి నడుపుము నను తుదివరకు } 2 || సాత్వీకుడా ||




  2. కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు

    ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది } 2

    గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా

    మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా } 2 || సాత్వీకుడా ||






Previous Post Next Post