Rathri nedu rakshakundu velise vinthaga రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా



రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా

నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2)



లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను

లోక నాథుడై మరియకవతరించెను (2)

ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||



బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము

యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2)

ఈ నాడే మనకు పండగ

రారండి ఆడి పాడగ (3) ||రాత్రి||



ఆకశాన తార ఒకటి బయలుదేరెను

తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2)

చిన్నారి యేసు బాబును

కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి||



పొలములోని గొల్లవారి కనుల ముందర

గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2)

మేరమ్మ జోల పాడగా

జగాలు పరవశించెగా (3) ||రాత్రి||



లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను

భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2)

ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||


Previous Post Next Post