Pamppumu deva dhivenalatho Pamppumu deva పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా



పంపుము దేవా  దీవెనలతో - పంపుము దేవా

   పంపుము దయచేత - పతిత పావన నామ

   పెంపుగ నీ సేవ - బ్రియ మొప్ప నొనరింప

    పంపుము దేవా  దీవెనలతో - పంపుము దేవా


1. మా సేవనుండిన - మా వెల్తులన్నియు

    యేసుని కొరకు నీ వెసగ క్షమియించును


2. వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి

    దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప


3. ఆసక్తితో నిన్ననిశము సేవింప

    భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి


Previous Post Next Post