Naa yesayya naa sthuthi yagamu naivedhyamu nai నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై



Song no: 96



    నా యేసయ్యా నా స్తుతియాగము
    నైవేద్యమునై ధూపము వోలె

    నీ సన్నిధానము చేరును నిత్యము

    చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)


  1. ఆత్మతోను మనసుతోను

    నేను చేయు విన్నపములు (2)

    ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై

    విజ్ఞాపన చేయుచున్నావా (2)

    విజ్ఞాపన చేయుచున్నావా || నా యేసయ్యా ||




  2. ప్రార్థన చేసి యాచించగానే

    నీ బాహు బలము చూపించినావు (2)

    మరణపు ముల్లును విరిచితివా నాకై

    మరణ భయము తొలగించితివా (2)

    మరణ భయము తొలగించితివా || నా యేసయ్యా ||




  3. మెలకువ కలిగి ప్రార్థన చేసిన

    శోధనలన్నియు తప్పించెదవు (2)

    నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై

    రారాజుగా దిగి వచ్చెదవు (2)

    రారాజుగా దిగి వచ్చెదవు || నా యేసయ్యా ||




Previous Post Next Post