E lokamlo yevvaru chupani kaluvari siluva prema iedhi ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది



ఈలోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువప్రేమ ఇది - కాలాలే మారినా మారని ప్రేమ ఇది " 2 "

ప్రేమా యేసునిప్రేమా - ప్రేమా కలువరి ప్రేమా

నను విడువని ప్రేమ - నను మరువని ప్రేమ "2" "ఈ లోకంలో"


1. శోకించు వేళ  విలపించు వేళా - యేసు నను చూచేనే - నా - భారము తొలగించెనే "2"

నీవెంటే నేనున్నా కన్నీరెందుకని - నీ చెంతే నేనుంటా దిగులే చెందకని

మనుష్యుల ప్రేమ ఆశించిన కన్నీరే మిగులునని

పలికిన నా యేసయ్య నీకే స్తోత్రమయా "2" "ఈలోకంలో"


2. శపియించబడి నేను కృశియించు వేళా తోడు నీవైతివే - నా - నీడ నీవైతివే "2"

నే నిన్ను విడచిన నన్ను విడువక వెంబడించినావే - నే నిన్ను మరచిన  నన్ను మరువక పలకరించినావే

గమ్యం లేని పయనంలో ప్రభుయేసే గమ్యమని

తెలుసుకొంటినయ్య నను మలచుకొంటినయ్యా "2"

                       "ఈ లోకంలో"


Previous Post Next Post