Devuni goppa premaku kalambu thelpa jaladhu దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు




Song no:






1. దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు

అత్యున్నత నక్షత్రమున్-అధోగతిన్ ఆవరించున్

నశించు జాతిన్ రక్షింపన్-సుతుని బంపెను

పాపంబు నుండి పాపికి-విశ్రాంతి దూరంనుంచి

||
దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||

2.
యుగాంత కాలమందున-భూరాజ్యముల్ నశించగా

యేసున్ నిరాకరించువారు -చావును కోరువేళను-

దేవుని ప్రేమ గెల్చును

అనంత జీవము-నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము

3
సముద్రము సిరాతో నిండి-ఆకాశమె కాగితమై

కొమ్మల్లె కలంబులే-ప్రతి నరుండు కరణమై

దేవుని ప్రేమన్ చిత్రింపన్-సంద్రంబు యింకును

ఆకాశవ్యాప్తి యంతయు-చాలకపోవును



Previous Post Next Post