Cherithi prabhuva nee sannidhi nee sannidhi pujalu cheyaga చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా




Song no:



చేరితి ప్రభువా నీ సన్నిధి



సాకి:           సర్వ సృష్టి స్థితిలయ కారకా - శ్రీ (యెహోవా) ప్రభువైన దేవా

కన్య మరియ గర్భాన వెలసిన  - శ్రీ యేసునాధా...

పిత సుతులకు అనుబంధమా - పవిత్రాత్మా నమస్తే.... నమస్తే...నమహః...



పల్లవి:  చేరితి ప్రభువా నీ సన్నిధి

           పూజలు చేయగా నా పెన్నిధి

           పాడి స్తుతింతును నీ దివ్య నామం

           వరములు చిందే ఈ దివ్యబలిలో



1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో

    వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా ||చేరితి||





2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం

   నూతన బలమును ఒసగుము దేవా



   కనురెప్పల మము కాయుము ప్రభువా              ||చేరితి||



Previous Post Next Post