Akashamulo neevu thappa inkevarunnarayya ఆకాశములో నీవు తప్ప ఇంకెవ్వరున్నారయ్యా



ఆకాశములో నీవు తప్ప

ఇంకెవ్వరున్నారయ్యా

భూలోకములో నీవుగాక

మాకెవ్వరున్నారయ్యా

నీ కృపయే మాకు ధన్యకరము }

నీ ప్రేమే మాకు జీవాహరం        }॥2॥

యేసయ్యా యేసయ్యా ॥2॥


            1॰

నా బలము నా శరీరము          }

క్షీణించియున్నను                    }

నా హృదయం నా ఆలోచనలు }॥2॥

కృంగియున్నను                       }

నీవు నాకు తోడుండగ

లోకములో ఏది నాకు

అవసరము లేదయ్యా

యేసయ్యా నీ కృప మాకు చాలునయ్యా

యేసయ్యా నీ ప్రేమా మాకు చాలునయ్యా

                                                      ॥2॥

యేసయ్యా యేసయ్యా ॥2॥


            2॰

లోకములో మరణపు ఉరులు   }

ఆవరించినను                          }

పెను తుఫాను భూకంపాలు       }॥2॥

చుట్టుకొనినను                          }

నీవు నాకు తోడుండగ

లోకములో ఏది నాకు

అవసరము లేదయ్యా

యేసయ్యా నీ కృప మాకు చాలునయ్యా

యేసయ్యా నీ ప్రేమా మాకు చాలునయ్యా

                                                      ॥2॥

యేసయ్యా యేసయ్యా ॥2॥


Previous Post Next Post