Yesu lechenu adhivaramuna yesu lechenu vekuvajamuna యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు


Song no: 218





యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను||



వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు||



సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు||



మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు||



స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు||



పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద ||యేసు||



యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ లేతురండి ||యేసు||



Previous Post Next Post