Sarva krupanidhi yagu prabhuva sakala chara santhosama సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా




Song no:



1. సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా



స్తోత్రము చేసి స్తుతించెదము – సంతోషముగ నిను పొగడెదము



పల్లవి:  హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయా



హల్లెలూయ యని పాడెదను – ఆనందముతో సాగెదను



2. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నను రక్షించితివి



పరిశుద్దముగ జీవించుటకై – పాపిని నను కరుణించితివి /హల్లెలూయ/



3. మరణ శరీరము మార్పు నొంది – మహిమ శరీరము పొందుటకై



మహిమాత్మతో నను నింపితివి – మరణ భయములను తీర్చితివి  /హల్లెలూయ/

Previous Post Next Post