Rajadhi raja ravikoti teja ramaniya samrajya రాజధి రాజ రవి కోటి తేజ రమణియ సామ్రజ్య పరిపాలక



Song no: 161



    రాజాధిరాజ రవి కోటి తేజ

    రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2

    విడువని కృప నాలో స్థాపించేనే

    సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2 || రాజాధి రాజా ||


  1. వర్ణనకందని పరిపూర్ణమైన నీ

    మహిమ స్వరూపమును నాకొరకే
    త్యాగముచేసి } 2

    కృపాసత్యములతో కాపాడుచున్నావు

    దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2 || రాజాధి రాజా ||



  2. ఊహలకందని ఉన్నతమైన
    నీ

    ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2

    ఊరేగించుచున్నావు
    విజయోత్సవముతో

    యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో || రాజాధి రాజా ||



  3. మకుటము ధరించిన మహారాజువై నీ

    సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2

    నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి

    నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2 || రాజాధి రాజా ||



Previous Post Next Post