Goppa devuda mahonnathuda athmatho sathyamutho aradhinthunu గొప్ప దేవుడా మహోన్నతుడా ఆత్మతో సత్యముతో ఆరాధింతును


Song no:



గొప్ప దేవుడా మహోన్నతుడా

ఆత్మతో సత్యముతో ఆరాధింతును

ఆనందింతును సేవింతును

ఆత్మతొ సత్యముతో ఆరాధింతును



1. నా దీనదశలో నన్నాధుకొని

నీ ఆశ్రయ పురములో చేర్చుకొని

నీ సన్నిధిలో నివశింప జేసీతివి

నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివి    //గొప్ప//



2.వివేకముతో జీవించుటకు

విజయముతొ నిను స్తుతించుటకు

నీ రక్షణతో అలంకరించితివి

నీ ఆనంద తైలముతో నన్నభిషేకించితివి//గొప్ప//



3.సర్వసత్యములో నేనడచుకొని

నిత్య సియోనులో నేనిలుచుటకు

జీవపు వెలుగు లో నడిపించుచున్నావు

నీ సంపూర్ణత నాలో కలిగించు చున్నావు.      // గొప్ప//

Previous Post Next Post