Nee mata naa pataga anukshanam padani నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ




Song no:



నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ

లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ

నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ

ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

||నీ మాట||



1. ఏ చోట గళమెత్తినా -

నీ ప్రేమ ధ్వనియించనీ

పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2

వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక

స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ

నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ

ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

||నీ మాట||



2. నీ దివ్య గానామృతం -

జలధారలుగా పొంగనీ

తాకేటి ప్రతి వారినీ -

ఫలవంతముగా మార్చనీ2

శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక

నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ

నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ

ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

 ||నీ మాట||



3. ఆత్మీయ గీతాలతో -

తనువంతా పులకించనీ

సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2

కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా

హృదయాల్లో నివసించుచూ -

కార్యాలు జరిగించనీ

నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ

ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

||నీ మాట||

Previous Post Next Post