Kannu theristhey velugura kannu musthey chikatira కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా


Song no:





    కన్ను తెరిస్తే వెలుగురా

    కన్ను మూస్తే చీకటిరా } 2

    నోరు తెరిస్తే శబ్దమురా

    నోరు మూస్తే నిశబ్దమురా

    ఏ క్షణమో తెలియదు జీవితం అంతం

    ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ॥కన్ను తెరిస్తే॥



  1. ఊయల ఊగితే జోల పాటరా

    ఊయల ఆగితే ఏడుపు పాటరా } 2

    ఊపిరి ఆగితే ఊగిసలాటరా

    ఊపిరి ఆగితే సమాధి పోటురా  ॥ఏ క్షణమో॥




  2. బంగారు ఊయలా ఊగినా నీవు

    భుజములపై నిన్ను మోయక తప్పదురా } 2

    పట్టు పరుపు పైనా పొర్లిన నీవు

    మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా  ॥ఏ క్షణమో॥




Previous Post Next Post