Dhayachesi chudave andhala thara దయచేసి చూడవే అందాలతార మా ఇంటిదాక ఒకసారి రావే




Song no:








దయచేసి చూడవే అందాలతార


మా ఇంటిదాక ఒకసారి రావే


అలనాడు నీవు గగనాన నిలచి


ప్రభుయేసు చూచి
తరియించినావే
|2|


ఎక్కడెక్కడ
యేసు పెరిగెనో


పెద్దలను పిన్నలను ఎలా
బ్రోచెనో తల్లిదండ్రికి తగిన బిడ్డగా


గురువు దైవమనే భక్తి ఎదను
నిండగా
|2|


ఆకాశమందుండి నువు చూసి నావు
|2|


కరుణతో తనకథ తెలియ జేయవే


ఓ నింగితార మా ఆశ తీర


శ్రీయేసు చరితం
వినిపించిపోవే
|దయచేసి|


ఎప్పుడెప్పుడు
ఏమి చేసెనో


ఆ మహిమలన్ని నింగినుండి
చూసినావుగా మేము చదవని క్రీస్తుబోధలు


తప్పకుండ నీకు తెలిసివుండి
తీరునే
|2|


ఆ బోధలన్ని వివరించ రావే |2|


జీవితం ధన్యమై బ్రతుకు
సాగాని


అందాలతార యెరిగించిపోవే


మా జీవితాలు వెలిగించిపోవే |దయచేసి|





Previous Post Next Post