Yuddha veerulam manamu yuddha veerulam యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం


Song no: 56



    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2

    మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2

    భయపడము జడియము -2

    అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2

    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం


  1. కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము

    పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు -2

    బలహీనతలో - మనము బలవంతులమయ్యాము -2

    శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా -2

    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2





  2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని

    మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము -2

    సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము -2

    స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా  -2



    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2

    మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2

    భయపడము జడియము -2

    అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2

    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం


    హోసన్నా - హోసన్నా - హోసన్నా

    యోధులమై సాగిపోదము



Previous Post Next Post