Yesu neetho naa jeevitham యేసు నీతో నా జీవితం ఎల్ల వేళలందు ఆనందమే




Song no: 55

యేసు నీతో నా జీవితం

ఎల్ల వేళలందు ఆనందమే

ఆరాధింతును అనుదినము

ప్రణుతింతును ప్రతి దినము



రాజుల రాజువని ప్రభువుల ప్రభువని

నీవు లేక ఏది కలుగలేదని

కీర్తింతును నిను కొనియాడెదన్ ద్యానింతును నీలో దినదినము



సర్వోన్నతుడని

సర్వశక్తి మంతుడవని

సమస్తానికి ఆదారము నీవని

పూజింతును నిను ఘనపరచెదన్

జీవింతును నీకై ప్రతిదినము

Previous Post Next Post