Song no:
యాకోబు బావి కాడ యేసయ్యను
చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి
ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి
దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు
దప్పిక కావన్నాడే (2)
||యాకోబు||
అయ్యా నే సమరయ స్త్రీని
– మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము
లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా
పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు
ఇస్తావయ్యా (2)
||యాకోబు||
అయినా నీళ్లు నాకు ఇమ్మని
నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ
భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు
లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే
(2) ||యాకోబు||
నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు
ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త
కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి
నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన
సాక్షినయ్యానమ్మా (2)
||యాకోబు||
నా గుట్టు విప్పినవాడు
నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో
లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా
(2)
తప్పకుండ యేసు ముందు తల
వంచి మొక్కాలమ్మా (2)
||యాకోబు||