Nuvve nuvve naa pranam నువ్వే నువ్వే నాప్రాణం నువ్వే నువ్వే నాధ్యానం




Song no:

నువ్వే నువ్వే నాప్రాణం

నువ్వే నువ్వే నాధ్యానం

నువ్వే నువ్వే నాసర్వం యేసయ్య " 2 "

కాచితివే గడచిన కాలం

చూపించితివే నీదు ప్రేమ



నను కన్నవారే నను మరచినా

నా బంధు స్నేహితులు నను విడచినా " 2 "

నాశ్రమల కాలంలో నను విడువక

నాచేయి పట్టుకొని నడిపించినావే



నా కొరకు నీవు పరము విడచినావు

పాపినైన నను రక్షింపన్ భువికేగినావు " 2 "

క్రయముగా ప్రాణాన్ని బలి పెట్టినావు

నీ మధుర ప్రేమను నే మరువలేను

Previous Post Next Post