Gali samudhrapu alalaku nenu గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు


గాలి సముద్రపు అలలకు నేను

కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)

ఆదరించెనూ నీ వాక్యము

లేవనెత్తెనూ నీ హస్తము (2)      ||గాలి||



శ్రమలలో నాకు తోడుంటివి

మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)

ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)

నీ కృపలో నను బ్రోచితివి (2)      ||గాలి||



వ్యాధులలో నీకు మొర్రపెట్టగా

ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)

చూపితివి నీ మహిమన్‌ (2)

కొనియాడెదను ప్రభుయేసుని (2)      ||గాలి||

Previous Post Next Post