Nee sallani supe o yesaya na brathukunu marchindhi messiya నీ సల్లని సూపే ఓ యేసయ్యా నా బతుకును మార్చించి మెస్సీయా


Song no: 116



    నీ సల్లని సూపే ఓ యేసయ్యా

    నా బతుకును మార్చించి మెస్సీయా } 2

    నీ మెల్లని మాటే ఓ యేసయ్యా } 2

    నను సేదదీర్చింది మెస్సీయా {నీ సల్లని}


  1. పశుశాలలో నీ జన్మ యేసయ్యా

    తగ్గింపు నేర్పింది మెస్సీయా } 2

    పరిశుద్ధ నీ నడత యేసయ్యా } 2

    మాదిరి నాకుంచింది మెస్సీయా {నీ సల్లని}




  2. నీవు కార్చిన రక్తం యేసయ్యా

    నా పాపం కడిగింది మెస్సీయా } 2

    నీవు పొందిన మరణం యేసయ్యా } 2

    నాకు జీవం పోసింది మెస్సీయా {నీ సల్లని}




  3. నీ దేహపు గాయం యేసయ్యా

    స్వస్థత కలిగించింది మెస్సీయా } 2

    నీ కలువరియాగం యేసయ్యా } 2

    కొత్తజన్మనిచ్చింది మెస్సీయా {నీ సల్లని}





Previous Post Next Post