Krupa sathya sampurnuda naa yesayya కృప సత్యసంపూర్ణుడ నా యేసయ్య




Song no:


కృప సత్యసంపూర్ణుడ నా యేసయ్య     
}

నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా }2

నజరేయుడా నా గలలీయుడా  2

నజరేయుడా నాదు గలలీయుడా

                                           
॥కృపా సత్య ॥

1

వాక్య ప్రణవ రూపమా దివ్య లోక తేజమ     
}

దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా }2

దినమెల్ల పాడిన వేనోళ్ల పొగడినా  }

నా ఆశ తీరదు నా దైవమా           
}2

॥నజరేయుడా॥                      
॥కృపా సత్య॥


2

అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు  }

ఆశతీర నీదు కొలిచెదను ఆత్మరూపుడా      
}2

ఆదరణ కర్త నీవై నన్నాదరించావు   }

ఆత్మాభిషేకముతో బలపరచినావు  }2

॥నజరేయుడా॥                      
॥కృపా సత్య॥


3

నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు }

నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు          
}2

నీ ప్రేమ చాటగా మనసార పాడగా  }

నా బాష చాలదు నా దైవమా        
}2

॥నజరేయుడా॥                      
॥కృపా సత్య॥







Previous Post Next Post