Yesu yela vivarinthunu napai nikunna prema యేసూ ఎలా వివరింతును నాపై నీకున్న ప్రేమ


॥ పల్లవి ॥

యేసూ ఎలా వివరింతును.... నాపై నీకున్న ప్రేమ

కను పాపను కాపాడే కను రెప్పకున్న ప్రేమ

దోసెడు నీళ్ళైన దాయని కురుయు మబ్బుకున్న ప్రేమ

సరితూగునా ఈ ఇలలో ఏ ప్రేమ అయినా (2)

నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ

ఆరాధనా .... ఆరాధనా .... నీ ప్రేమకే నా ఆరాధనా ....



ఛళ్ళు ఛళ్ళు మని కొరడా దెబ్బలు గాయపరుచుచున్నా

దున్నుతున్న వీపు రక్తము చిందించి … ఏరులై పారుతున్నా

శిరస్సున ముళ్ళ కిరీటం ఈటెలై పొడుచుకుపోతున్నా (2)

అణువైన తగ్గలేదు ప్రభూ ----- నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ

-- ఆరాధనా --



మోయలేని సిలువ భారము మోసినా ... ఉమ్మి వేయబడినా

సీలలే అర చేతిని చీల్చినా... ఖడ్గములై గుండెను కోసినా

కడ సారి దప్పిక దీర్చ నీళ్ళైన కరువయినా (2)

కాస్త అయిన తరిగిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ

-- ఆరాధనా --



పాపపు మార్గము ఎంచినా ... అపరాధిని అయినా

నీ నామము వ్యర్థముగా వాడినా ... కలుషములే పలికినా

నిన్ను యెరుగనని అబద్ధమాడినా ... నీ గుణమే శంకించినా (2)

ఒక్క క్షణమైనా వీడిపోలేదు ప్రభూ ------ నాపై నీకున్న ప్రేమ … నాకై నీకున్న ప్రేమ

-- ఆరాధనా --

Previous Post Next Post