Saranu jocchithi yesu nadhuda sakthihinatha శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె


Song no: 421



శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||



కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||



మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||



తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||



శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||



Previous Post Next Post