Nannenthaga preminchithivo ninnethaga dhushinchithino నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో


॥ పల్లవి ||

నన్నెంతగా ప్రేమించితివో...నిన్నంతగా దూషించితినో...

నన్నెంతగా నీవెరిగితివో...నిన్నంతగా నే మరచితినో...

గలనా... నే చెప్పగలనా...

దాయనా ... నే దాయగలనా... (2)

అయ్యా... నా యేసయ్యా...

నాదం... తాళం... రాగం

ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)



ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...

ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)

ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...

ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2)

|| గలనా ||



ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...

ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)

ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...

ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2)

|| గలనా ||

Previous Post Next Post