Shodhakudosthadu saithan gadu vadu శోధకుడొస్తాడు సైతాన్ గాడు వాడు శోధిస్తునే ఉంటాడు




Song no:



శోధకుడొస్తాడు సైతాన్ గాడు వాడు

శోధిస్తునే ఉంటాడు మనలను శోధిస్తునే వుంటాడు

దేవుడు వస్తాడు బలవంతుడాయన

జయమిస్తునే ఉంటడు

మనకు జయమిస్తునే ఉంటడు



ఆదివారం వచ్చేసరికి

నిన్ను రానియ్యడు వాడు గుడికి

ఆ వారమంతా నీలో

కలిగేది అంతా చింత

ఆ వారమంతా నీకు

మిగిలేది ఎంతో కొంత

దేవుని ఆశీర్వాదం రాకుండ చేసి

కష్టాల పాలు చేయును

నిన్ను నష్టాల పాలు చేయును



ఆల్ నైట్  వచ్చే సరికి

నిన్ను రానియ్యడు ప్రార్ధనకి

భద్రంగ ఇచ్చును చద్ర

వాడు పొడుపోమ్మంటాడు

మొద్దు నిద్ర

ఆ నిద్రే పెద్ద దరిద్రం

పండుబోతుని చేయును

నిను తిండిబోతుని చేయును



పండుగ వచ్చేసరికి పదపదమాంటడు నిను గుడికి

కొట్టమని చెబుతాడు పోజులు కోయమని చెబుతాడు పోతులు

తినుచు త్రాగుచు తందనాలు ఆడి అవతల పడమంటడు

మళ్ళీ పండక్కే రమ్మంటాడు 

أحدث أقدم