Mahimantha vadhulukoni thana rupam marchukoni మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని



మహిమంతా వదులుకొని - తన రూపం మార్చుకొని

యేసు భువికొచ్చాడని

ఊరంతా సందడి - వాడంతా సందడి - ఊరు వాడ సందడి

మంచిలేని లోకంలో మంచిని స్థాపించడానికి

మేలెట్లా చెయ్యాలో చేసి చూపడానికి

కీడును తొలగించడానికి

పాపమేమిలేనివాడు ఇలలో పుట్టాడని

నింగిలో సందడి - నేలపై సందడి

నింగీ నేలా సందడి

శాంతిలేని లోకంలో శాంతిని దయచేయడానికి

సత్యాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి

స్వర్గానికి చేర్చడానికి

శాంతిదాతయైనవాడు ఇలలో పుట్టాడని

ఇంటింటా సందడి - బయటంతా సందడి

ఇంటా బయటా సందడి

కాంతిలేని లోకంలో జ్యోతిని వెలిగించడానికి

దేవుడుగా పరిచయం చేసుకోవడానికి

ప్రత్యక్షత ఇవ్వడానికి

నీతి సూర్యుడైనవాడు ఇలలో పుట్టాడని

కోటలో సందడి పేటలో సందడి

కోటా పేటా సందడి


أحدث أقدم